Mahesh Babu: బాలీవుడ్‌పై మహేశ్ బాబు వ్యాఖ్యలు.. స్పందించిన ఆర్జీవీ..
Mahesh Babu: మహేశ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు రామ్ గోపాల్ వర్మ. మహేశ్ వ్యాఖ్యలను తప్పుబట్టడానికి లేదని అన్నాడు వర్మ.;
Mahesh Babu: ప్రస్తుతం జాతీయ భాషా వివాదం ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారుతుంటే.. మరోవైపు నటీనటులు చేసే కామెంట్స్ ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో.. ఆ వివాదంలో భాగమవుతున్నాయి. తాజాగా మహేశ్ బాబు కూడా బాలీవుడ్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ గురించి తన ఉద్దేశ్యం అది కాదు అని క్లారిటీ ఇచ్చేలోపే పలువురు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.
ప్రస్తుతం చాలామంది స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అందుకే మహేశ్ ఎప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడంటూ పలువురిలో సందేహాలు ఉన్నాయి. అయితే ఈ సందేహాలకు మహేశ్ ఎప్పటినుండి అయినా చెప్పే సమాధానం ఒక్కటే. తన సమయాన్ని బాలీవుడ్‌లో వృథా చేయాలని తాను అనుకోవట్లేదని. తాజాగా మరోసారి ఇదే మాట అన్నాడు మహేశ్.
మహేశ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు రామ్ గోపాల్ వర్మ. మహేశ్ వ్యాఖ్యలను తప్పుబట్టడానికి లేదని అన్నాడు వర్మ. ఎందుకంటే ఎక్కడ సినిమాలు చేయాలని, ఎలాంటి కథలు ఎంచుకోవాలన్నది నటుడిగా తన సొంత నిర్ణయం అని చెప్పాడు. అంతే కాకుండా బాలీవుడ్ తనను భరించలేదు అంటూ మహేశ్ మాట్లాడిన మాటలు తనకు అర్థం కాలేదు అన్నాడు ఆర్జీవీ.