రామ్ పోతినేని హీరోగా మహేశ్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాపో 22 సినిమాను మేకర్స్ ఎట్టకేలకు ఖరారు చేశారు. ఈ చిత్రానికి 'ఆంధ్రా కింగ్ తాలూకా ' అనే ఆసక్తికరమైన పేరును ఖరారు చేసినట్లు చిత్రబృం దం అధికారికంగా ప్రకటించింది. 'బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్' అనేది ట్యాగ్ లైన్. ఇందులో సాగర్ గా రామ్ కనిపించనుండగా.. మహాలక్ష్మిగా భా గ్యశ్రీ బోర్సే అలరించనున్నారు. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్ర పోషించనున్నారు. నిన్న రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా మేకర్స్ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. కథలో ఉపేంద్ర హీరో కాగా.. ఆయన్ని అభిమానించే వ్యక్తిగా రామ్ ఇందులో కనిపించనున్నట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. రామ్ హీరో అయినప్ప టికీ ఈ ప్రత్యేక పాత్రలో ఒక గొప్ప అభిమాని పాత్రను పోషించడం విశేషం. అభిమాని పాత్రలో అతని స్టైల్, ఎమోషన్ గొప్పగా కనిపిస్తున్నాయి. కథలో సూపర్స్టా ర్ కేవలం కటౌట్ రూపం లో నే కని పించడమే కాక, ఉపేంద్రను స్క్రీన్ పై ఐకాన్ గా పరిచయం చేశారు. ఇవాళ విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.