ఇస్మార్ట్ శంకర్ సినిమాను మించి ఉండాలనే ‘డబుల్ ఇస్మార్ట్’ స్టోరీ పూరీ రాశారని రామ్ పోతినేని చెప్పారు. పూరీ ఎక్కువ సమయం తీసుకున్న స్క్రిప్ట్ ఇదేనని తెలిపారు. డబుల్ ఇస్మార్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. పూరీతో పని చేసేటప్పుడే కాకుండా అతని స్క్రిప్ట్ వింటున్నపుడూ కిక్ వస్తుందన్నారు. కమర్షియల్ సినిమాలు తెరకెక్కించడం అంత సులువు కాదని పేర్కొన్నారు. ఈ నెల 15న ‘డబుల్ ఇస్మార్ట్’ విడుదల కానుంది. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు.
ఈ వేడుకకు హాజరుకాలేకపోయిన పూరి జగన్నాథ్ వీడియో ద్వారా మాట్లాడారు. ‘‘ఫంక్షన్‌కు రాలేకపోయినందుకు సారీ. సినిమా పనుల్లో బిజీగా ఉన్నా. నా వైజాగ్‌లో నేను లేనందుకు చాలా బాధగా ఉంది. విశాఖపట్నంలో ఉన్న థియేటర్లలన్నింటిలో సినిమాలు చూశా. ఆ ప్రేమతోనే డైరెక్టర్ అయ్యా. ఈ మూవీ హిట్ అయ్యాక వైజాగ్ వచ్చి మీ అందరినీ కలుస్తా’’ అని చెప్పారు.