Ramanna Youth: రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేసిన లోక్ సత్తా అధినేత
ఇలాంటి సినిమాలని మనమందరం సపోర్ట్ చేయాలన్న జయప్రకాష్ నారాయణ
అభయ్ నవీన్.. తానే హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తోన్న 'రామన్న యూత్' చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్ ను లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ విడుదల చేశారు. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన జయప్రకాష్ నారాయణ.. చాలామంది యువత రాజకీయాలు అంటూ సరైన నాయకుడిని ఎంచుకోకుండా గుడ్డిగా తిరిగి జీవితాలు పాడుచేసుకుంటున్నారు అనే బాధ నాకు ఎప్పుడూ ఉండేదన్నారు. అలాంటి అంశాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి వినోదాన్ని జోడించి ఒక మంచి సినిమా చేశారని కొనియాడారు. 'రామన్న యూత్' సినిమా గురించి చెప్పగానే తనకు చాలా ఆనందమేసిందని, ఇలాంటి సినిమాలని మనమందరం సపోర్ట్ చేయాలని చెప్పారు. సినిమా అనేది ఎంటర్ టైన్ చేస్తూనే ఎడ్యుకేట్ చేయాలని ఆయన తెలిపారు. రామన్న యూత్ టీజర్ చూశాను చాలా బాగుందన్న ఆయన.. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.
"మా సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేసిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి కృతజ్ఞతలు. రాజు అనే ఒక యువకుడు పొలిటికల్ లీడర్ గా ఎదగాలని చేసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది మా రామన్న యూత్ చిత్రంలో ఆసక్తికరంగా తెరకెక్కించాం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ ఎంటర్ టైనర్ ఇది. గ్రామీణ ప్రాంతాల్లో యువత రాజకీయ నాయకుల కోసం ఎలాంటి త్యాగాలు చేస్తున్నారు. ఆ యువతను కొందరు నేతలు ఎలా తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు అనేది రామన్న యూత్ సినిమాలో వినోదాత్మకంగా, ఆలోచింపజేసేలా తెరకెక్కించాం. సినిమా అంతా సహజంగా మన ఊరిలో జరిగిన ఫీలింగ్ కలిగిస్తుంది. సెప్టెంబర్ 15న రామన్న యూత్ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఒక మంచి ప్రయత్నం చేశాం. మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాం" అని హీరో, దర్శకుడు అభయ్ నవీన్ అన్నారు.
కాగా ఈ చిత్రంలో అభయ్ నవీన్ తో పాట అనిల్ జీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు, టాక్సీ వాలా విష్ణు, అమూల్య రెడ్డి, కొమ్మిడి విశ్వేశ్వర్ రెడ్డి, జగన్ యోగిరాజు, బన్నీ అభిరాన్, మాన్య భాస్కర్, వేణు పొలసాని తదితరులు పలు పాత్రల్లో అలరించనున్నారు.
Ramanna Youth releasing on September 15th, Release Date Poster was launched by Lok Satta Party founder Dr. Jayaprakash Narayana FULL VIDEO 👇🏻👇🏻#RamannaYouth in theatres from September 15th 💥@AbhaiNaveen @anilgeela @shri_iyyangar #AmulyaReddy @BunnyAbiran @syedkamran… pic.twitter.com/9RKhQiosin
— BA Raju's Team (@baraju_SuperHit) August 21, 2023