Ramba : రంభ రీ ఎంట్రీ.. కీలక పాత్రలతో ప్రేక్షకుల ముందుకు

Update: 2025-03-04 05:45 GMT

90వ దశకంలో తన అందం, గ్లామర్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన హీరోయిన్ రంభ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడతో సహా పలు భాషల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదిం చుకుంది. ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్, ఆకట్టుకునే అభినయం, హాస్యానికి పెట్టింది పేరుగా నిలిచింది. ఇప్పుడు ఆమె మళ్లీ వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. నటనకు విరామం ఇచ్చిన తర్వాత, ఇప్పుడు మరింత కీలక పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా తన రీఎంట్రీ గురించి రంభ మాట్లా డుతూ 'సినిమా అంటే నాకు ఎప్పటినుం చో అమితమైన ప్రేమ. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీకి రావడానికి సరైన టైం అని భావించా. నటిగా నాకు న్యూ రోల్స్ చేయాలని ఉంది. ప్రేక్షకులకు మరింత కొత్త అనుభూతిని అందిం చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తు న్న' అని తెలిపారు. కాగా, రంభ ప్రముఖ హీరోల మూవీలో నటించనున్నదని తెలుస్తోంది. రంభ రీఎంట్రీ వార్త వినగానే ఫ్యాన్స్ ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. మరి ఆమెను ఏ విధమైన పాత్రల్లో చూడబోయేది కొద్ది రో జుల్లో తెలనుంది.

Tags:    

Similar News