Ranbir Alia: కొత్తజంటకు రణభీర్ తల్లి కాస్ట్‌లీ గిఫ్ట్.. ఏకంగా రూ. 26 కోట్లు పెట్టి..
Ranbir Alia: ఆలియా భట్, రణభీర్ కపూర్ గత ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.;
Ranbir Alia: ప్రస్తుతం బాలీవుడ్‌లో మాత్రమే కాదు.. సోషల్ మీడియా మొత్తంలో రణభీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లే హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని తెలిసినప్పటి నుండి వీరి పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని అభిమానులంతా ఎదురుచూశారు. కానీ రణభీర్, ఆలియా మాత్రం బయటికి తెలియకుండా కొందరు కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లితంతును పూర్తిచేశారు. అయితే ఈ కొత్తజంటకు రణభీర్ తల్లి ఓ కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిందట.
ఆలియా భట్, రణభీర్ కపూర్ గత ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కానీ ఆలియా మాత్రం చాలాకాలం నుండే రణభీర్‌ను ఇష్టపడుతోంది. వీరి ప్రేమ.. పెళ్లి వరకు వెళ్తుందని చాలామంది ఊహించలేదు. పెళ్లి ఫోటోల్లో వీరు చాలా క్యూట్‌గా ఉన్నారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రణభీర్, ఆలియాల పెళ్లికి ఎక్కువగా సెలబ్రిటీలను స్వాగతించకపోయినా.. చాలామంది వీరికి విషెస్ తెలుపుతూ కాస్ట్‌లీ గిఫ్ట్స్ పంపించినట్టు సమాచారం. అయితే రణభీర్, ఆలియా కలిసుండడం కోసం రణభీర్ తల్లి నీతూ కపూర్ ఓ కాస్ట్‌లీ ఫ్లాట్‌ను వీరికి గిఫ్ట్‌గా ఇచ్చిందట. దీని ఖరీదు ఏకంగా రూ.26 కోట్లు ఉంటుందని బాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్.