Rashmika Mandanna : రష్మిక హ్యాపీ.. ఫొటోలు వైరల్

Update: 2025-02-27 06:15 GMT

కన్నడలో కిరాక్ పార్టీతో లైమ్ లైట్ లోకి వచ్చి 'ఛలో' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న. శ్రీవల్లి గా ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ వరుస క్రేజీ ఛాన్స్ లు అందుకుంది. రణబీర్ కపూర్ 'యానిమల్' చిత్రంతో బాలీవుడ్లోనూ ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ నేషనల్ క్రష్ గత రెండేళ్లలో నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. రీసెంట్ గా 'ఛావా' చిత్రంతో ఏసుబాయిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. స్టార్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ మూవీకి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. ఛత్ర పతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 14న గ్రాండ్గా థియేటర్ల లో రిలీజై రూ. 400 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తాంది. దీంతో ప్రజెంట్ మూవీ టీమ్ ప్రజెంట్ 'ఛావా' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తు న్నారు. ఈ క్రమంలోనే వరుస పోస్టులతో సందడి చేస్తుంది రష్మిక. తాజాగా పింప్రెస్ లో ట్రెడీషనల్ లుక్లో ఉన్న పిక్స్ ను ఇన్స్టాలో షేర్ చేసింది. 'ఈఫొటోలలాగే లైఫ్ కూడా ఎప్పుడూ సంతోషంగా, ప్రకాశవంతంగా, ఉల్లాసభరితంగా అండ్ సరదాగా ఉంటే ఎంత బాగుంటుది కదా!' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రజంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News