Rashmika Mandanna : రష్మిక మందాన్న కొత్త ప్రేమ

Update: 2025-04-23 06:30 GMT

నేషనల్ క్రష్ రష్మిక మందాన్న పాన్ ఇండియా రేంజ్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ యానిమల్, పుష్ప 2, ఛావా మూవీలతో సూపర్ హిట్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఇటీవల వచ్చిన సికిందర్ చిత్రంతో నిరాశపరచింది. ఆ తర్వాత ఈ అమ్మడు కాస్త గ్యాప్ తీసుకుని ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రష్మిక హిందీలో ప్రస్తుతం రెండు పెద్ద సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈముద్దుగుమ్మ లేటెస్టుగా పూల గురించి ఇన్స్టాగ్రా మ్ ద్వారా స్పందించింది. 'నువ్వు చివరిసారిగా ఎప్పుడు పువ్వులు కొనుక్కున్నావు? నిన్ను నువ్వు తరచుగా అభినందించుకోవడానికి, కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఒక సున్నితమైన జ్ఞాపకం పూలు. ఎందుకంటే ప్రపంచంలోని ప్రేమ, దయ అంతా పూలకు అర్హం' అంటూ పూలపై తన ప్రేమను కనబర్చింది. తాజాగా ఈబ్యూటీ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Tags:    

Similar News