Rashmika Mandanna : ఆ సమయంలో కన్నీళ్లతోనే ఇంటికి వచ్చేదాన్ని: రష్మిక

Update: 2024-08-13 11:15 GMT

కెరీర్ తొలినాళ్లలో మూవీ ఆడిషన్‌కు వెళ్లిన ప్రతిసారీ కన్నీళ్లతోనే ఇంటికి తిరిగి వచ్చేదాన్నని హీరోయిన్ రష్మిక అన్నారు. ఒక సినిమాకు సెలక్టయ్యాక 2, 3 నెలల పాటు వర్క్ షాప్స్ జరిగాయని, కొద్ది రోజులకే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రతి సినిమాకు తనను తాను మెరుగుపరుచుకుంటున్నానని తెలిపారు. ఇక సినిమాల విషయానికొస్తే రష్మిక చేతిలో భారీ ప్రాజెక్ట్‌లే ఉన్నాయి. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రాబోతున్న ‘పుష్ప2’లో రష్మిక పాత్ర మరింత బలంగా ఉండనుంది. దీంతో పాటు బాలీవుడ్‌లో విక్కీ కౌశల్‌తో ‘ఛావా’, సల్మాన్‌తో ‘సికిందర్‌’ తదితర చిత్రాల్లో నటిస్తోంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ‘పుష్ప-1’తో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు ‘పుష్ప2: ది రైజ్‌’లోనూ అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News