Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో పెళ్లి.. స్పందించిన రష్మిక..
Rashmika Mandanna: రష్మికతో పెళ్లి అన్న కథనాలపై విజయ్ స్పందించాడు. వాటిని నాన్‌సెన్స్ అంటూ ఖండించాడు.;
Rashmika Mandanna: సినీ పరిశ్రమలో ఇద్దరు నటీనటులు సన్నిహితంగా ఉంటున్నారంటే వారిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ రూమర్స్ మొదలయిపోతాయి. ఒకవేళ వారు కలిసి రెండు సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ కనిపిస్తే వారు డేటింగ్‌లో ఉన్నారంటూ కన్ఫర్మ్ చేసేస్తారు నెటిజన్లు. అలాగే తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా రిలేషన్‌లో ఉన్నారంటూ.. పెళ్లి అంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. దానికి రష్మిక తొలిసారి స్పందించింది.
విజయ్, రష్మిక కలిసి 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' లాంటి చిత్రాల్లో నటించారు. ఈ రెండు సినిమాల్లో వారి కెమిస్ట్రీ హైలెట్‌గా నిలిచింది. అంతే కాకుండా వీరిద్దరు ఆఫ్ స్క్రీన్ కూడా మంచి స్నేహితులు. ఆ సాన్నిహిత్యాన్ని చూసి విజయ్, రష్మిక రిలేషన్‌లో ఉన్నారంటూ ఇప్పటికీ ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయి. వీరిద్దరు ఎప్పటికప్పుడు ఈ రూమర్స్‌ను కొట్టేపారేస్తూనే ఉన్నారు. తాజాగా వీరికి ఏకంగా పెళ్లి అంటూ కథనాలు మొదలయ్యాయి.
రష్మికతో పెళ్లి అన్న కథనాలపై విజయ్ స్పందించాడు. వాటిని నాన్‌సెన్స్ అంటూ ఖండించాడు. ప్రస్తుతం రష్మిక కూడా వీటిపై స్పందించింది. ఇలాంటి రూమర్స్ తనకేం కొత్త కాదు అంటోంది రష్మిక. ప్రేమకు, పెళ్లికి తన దగ్గర సమయం లేదంటూ క్లారిటీ ఇచ్చేసింది. కానీ నెటిజన్లు మాత్రం ముంబాయిలో వీరి చక్కర్ల గురించి మాట్లాడుకోవడం ఆపట్లేదు.