టాలెంటెడ్ బ్యూటీ రష్మిక మందన్నాకు వరుస విజయాలు వస్తున్నాయి. గ్లామర్ తో పాటు యాక్టింగ్ పరంగానూ అదరగొడుతోంది. పుష్ప 2తో ప్యాన్ ఇండియా రేంజ్ లో మరోసారి మెరిసిన ఈ బ్యూటీ నెక్ట్స్ ఇయర్ ఏకంగా 4-6లతో రాబోతోంది. ఇవన్నీ కూడా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. దీంతో ఇండియాలోనే హయ్యొస్ట్ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్న హీరోయిన్ కాబోతోందంటున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఈ మధ్య తెలిసీ తెలియక నోరు జారుతోంది. దీంతో నెటిజన్స్ అమ్మడిని ఆడేసుకుంటున్నారు.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పుష్ప 2లో అల్లు అర్జున్ 20 నిమిషాలకు పైగా చీర కట్టుకుని ఉంటాడు. ఏ హీరో అలా చేయగలడు అంటూ చెప్పింది. దీంతో లేడీ గెటప్ తోనే సినిమాలు చేసిన స్టార్ హీరోలు చాలామంది ఉన్నారంటూ సత్యభామలో కమల్ హాసన్ నుంచి చాలా ఉదాహరణలు చూపిస్తూ ట్రోల్ చేశారు రష్మికను. నిజంగా చాలామంది స్టార్ హీరోలు చాలాసార్లు లేడీ గెటప్ లో కనిపించిన సందర్భాలున్నాయి. కానీ అల్లు అర్జున్ మాత్రమే అలా చేశాడు అన్నట్టుగా మాట్లాడ్డంతో రష్మికను ఆడేసుకున్నారు.
లేటెస్ట్ గా ఓ కోలీవుడ్ ఇంటర్వ్యూలో .. అక్కడ విజయ్, త్రిష జంటగా నటించిన బ్లాక్ బస్టర్ 'గిల్లి' సినిమా తెలుగు పోకిరికి రీమేక్ అని చెప్పింది. నిజానికి ఈ మూవీ ఒక్కడుకు రీమేక్. బట్ తను నోటికి ఏది వస్తే అదే అనేస్తూ ఉండటంతో మరోసారి ట్రోల్ కు గురి కాక తప్పలేదు. ఏదైనా రష్మికకు సినిమా నాలెడ్జ్ చాలా తక్కువ అని గతంలో కూడా ఇలా టంగ్ స్లప్ అయ్యింది అని గుర్తు చేస్తున్నార కొందరు. కొన్నిసార్లు కామ్ గా ఉంటేనే బావుంటుంది. తెలియని విషయాలను తెలిసినంత కాన్ఫిడెంట్ గా చెబితే ఇలా ట్రోల్ అవుతారు మరి.