బ్యాక్టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ రష్మిక. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో కలిసి 'థామా' హారర్ కామెడీలో నటిస్తుంది. దీనితో పాటు 'ది గర్ల్ ఫ్రెండ్ 'తో రెడీ అవుతోంది. తాజాగా ‘మైసా' అనే చిత్రాన్ని కూడా ప్రకటించింది. అలాగే అట్లీ, స్టైలిష్ స్టార్అల్లు అర్జున్ కాంబోలోనూ ఈ అమ్మడు కనిపించనున్నట్లు సమాచారం. ఇక వరుస చిత్రాలతో తన క్రేజ్ ను నిలబెట్టుకుంటున్న నేషనల్ క్రష్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఇటీవల ఈ బ్యూటీ నటించిన 'యానిమల్' మూవీ భారీ విజయాన్ని సాధించగా, అదే స్థాయిలో విమర్శలకూ గురైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. యానిమల్ సినిమాలో హీరో పాత్రలో కనిపించిన వ్యక్తి స్వభావం ఉన్నవారితో మీరు డేటింగ్ చేయగలరా? వారిలో మార్పు తీసు కురాగలరా? అని ఒకరు ప్రశ్నించారు.…