Rashmika : రష్మిక స్పీడుకు బ్రేకులు!

Update: 2025-04-02 11:15 GMT

పుష్ప, యానిమల్, పుష్ప2, ఛావా ఇలా వరుస విజయాలు అందుకుని అగ్రశ్రేణి నాయికగా పేరు తెచ్చుకుంటున్న రష్మిక వేగానికి బ్రేక్ పడిందని అంటున్నారు. ఆమె సల్మాన్ ఖాన్ కు జోడీగా నటించిన 'సికిందర్' సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. హీరోకు, హీరోయిన్ కు మంచి క్రేజ్ ఉంది. పైగా మురుగదాస్ దర్శకుడు అయినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రంజాన్ పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమాకు మొదటిరోజు దేశవ్యాప్తంగా కేవలం రూ.26 కోట్లు మాత్రమే వచ్చాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. గత సల్మాన్ సినిమాలతో పోలిస్తే అతి తక్కువ ఓపనింగ్ అని అంటున్నారు. ఈ సినిమాపై రష్మిక సైతం మంచి నమ్మకం పెట్టుకుంది. సల్మాన్ వంటి మాస్ హీరోతో, కమర్షియల్ సినిమా చేయడం వల్ల ప్రేక్షకుల్లో ఇంకా ఎక్కువ ఆదరణ పొందవచ్చని భావించింది. కానీ తీరలేదు. ఐనా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని రష్మిక చెబుతోంది. 

Tags:    

Similar News