MAA Elections 2021: మనకు చేతకాదా? బయటవాళ్లే కావాలా?: రవి బాబు

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది.

Update: 2021-10-06 07:51 GMT

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. రాజకీయ ఎన్నికలను తలపిస్తు్న్న మా అధ్యక్ష ఎన్నికల గురించే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్. పోటీలో నిలబడిన మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ఛాన్స్ దొరికినప్పుడల్లా పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. వారితో పాటు వారి ప్యానెల్ సభ్యులు కూడా అలాగే ఉన్నారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో దర్శకుడు, నటుడు రవి బాబు కూడా మా ఎన్నికలపై స్పందించారు.

'లోకల్‌ నాన్‌లోకల్‌ వివాదంపై మాట్లాడాలనుకోవడం లేదు. ఏదో ఒక ప్యానల్‌కు ఓటు వేయమని చెప్పాలనుకోవడం లేదు. మనకి ఎంతో మంది క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు ఉండగా.. మన దర్శక నిర్మాతలు మాత్రం బయటవాళ్లకే ఎక్కువగా అవకాశాలిస్తున్నారు. వాళ్ల డిమాండ్‌లకు ఒప్పుకొని మరీ ఆఫర్లు ఇస్తున్నారు. అదే మాదిరిగా కెమెరామెన్‌లు, మేకప్‌మేన్‌లు.. ఇలా ఒక్కటేమిటి.. సినిమాకు సంబంధించిన చాలా విభాగాల్లో మన వాళ్లకంటే బయటవాళ్లకే ఎక్కువ అవకాశాలిస్తున్నారు.'

'ఈ విషయాన్ని పక్కనపెడితే.. నటీనటుల సంక్షేమం కోసం.. వాళ్ల సమస్యల పరిష్కారం కోసం మనం ఏర్పాటు చేసుకున్న చిన్న సంస్థ 'మా'. మన కోసం మనం పెట్టుకున్నాం. అలాంటి ఒక చిన్న సంస్థలో పనిచేయడానికి కూడా మనలో ఒకడు పనికిరాడా? దీనికి కూడా మనం బయట నుంచే మనుషులను తెచ్చుకోవాలా? ఇది మన సంస్థ.. మనం నడుపుకోలేమా? మనకి చేతకాదా? ఒక్కసారి ఆలోచించండి' అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. లోకల్, నాన్ లోకల్ వివాదం గురించి మాట్లాడను అంటూనే ఇన్‌డైరెక్ట్‌గా తన అభిప్రాయాలను బయటపెట్టారు రవి బాబు.

Tags:    

Similar News