ఎవ్వరేమన్నా.. మన తెలుగు హీరోలకు వృత్తిపట్ల అంకిత భావం ఎక్కువ. క్రమశిక్షణతో షూటింగ్ లో పాల్గొంటుంటారు. మిగతా ఏ భాషలోనూ.. ఏ రాష్ట్రంలోనూ ఇంత కమిట్ మెంట్ కనిపించదు. కొన్ని సార్లు ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నప్పటికీ, నిర్మాతకు ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో షూటింగ్ చేస్తున్నారు. అలాంటి హీరోల్లో రవితేజ ఒకరు.
ప్రస్తుతం 'మిస్టర్ బచ్చన్ 'చిత్రీకరణలో రవితేజ ( Ravi Teja ) పాల్గొంటున్నారు. ఆయనకు తీవ్రమైన మెడనొప్పి ఉంది. ఆ నొప్పితోనే షూటింగ్ చేస్తున్నారని తెలుపుతూ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ( Harish Shankar ) సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేస్తూ పేర్కొన్నారు. నొప్పిని తట్టుకుని, చిత్రీకరణలో పాల్గొంటున్న రవితేజ అంకిత భావాన్ని అభిమానులు సైతం మెచ్చుకుంటున్నారు. విశ్రాంతి తీసుకుని అవకాశం ఉన్నప్పటికీ, షూటింగ్ కు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో రవితేజ్ షూటింగ్ చేస్తున్నారు.
రవితేజ, హరీష్ శంకర్ కలయికలో గతంలో షాక్, మిరపకాయ్ చిత్రాలువచ్చాయి. మూడవ చిత్రం 'మిస్టర్ బచ్చన్' సెట్స్ లో ఉంది. ఇది రవితేజ తరహా యాక్షన్ చిత్రం. ఇందులో అమితాబ్ అభిమానిగా రవితేజ కనిపిస్తారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇది రవితేజ 75వ సినిమా.