మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన సినిమా ‘మాస్ జాతర’. భాను భోగవరపు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. ధమాకా తర్వాత శ్రీ లీల మరోసారి రవితేజతో రొమాన్స్ చేయబోతోంది. ఆ మధ్య విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. క్రాక్, వాల్తేర్ వీరయ్య తర్వాత రవితేజ మళ్లీ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని అర్థమైంది. లేటెస్ట్ గా ఈ మూవీని ఈ యేడాది వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 27న విడుదల చేయబోతున్నాం అని ప్రకటించారు.
నిజానికి మాస్ జాతరను 2025 సంక్రాంతికే విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ లో రవితేజకు యాక్సిడెంట్ అయింది. మూడు నెలల వరకూ రెస్ట్ అవసరమైంది. ఆ తర్వాత మే 9న వస్తుందేమో అన్నారు. ఆపై జూన్ లో అనుకున్నారు. కానీ జూలై ఫస్ట్ వీక్ వరకూ ఆల్రెడీ అనౌన్స్ మెంట్ లు అయిపోయాయి. ఆగస్ట్ అంటే ఇండిపెండెన్స్ డే.. అదీ ఆక్యూ పై అయిపోయింది. దీంతో వినాయక చవితిని బెటర్ ఆప్షన్ గా అనుకున్నారు. మామూలుగా వినాయక చవితి అంటేనే తీన్మార్ డ్యాన్సులు, డప్పు దరువులు, యువత కోలాహలం ఇవన్నీ కనిపిస్తుంటాయి. అలాంటి జోష్ కు మాస్ రాజా లాంటి హీరో తోడైతే థియేటర్స్ లో మాస్ జాతరే అనుకున్నారేమో.. అందుకే ఆగస్ట్ 27ను సెలెక్ట్ చేసుకున్నారు.