Chiranjeevi : స్క్రిప్ట్ లాక్ అయింది.. చిరు నవ్వులకు సిద్ధం

Mega Anil Project Final Narration Done;

Update: 2025-03-26 11:30 GMT

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందే సినిమా స్క్రిప్ట్ లాక్ అయింది. ఇక త్వరలోనే సెట్స్ పైకి అడుగుపెట్టబోతున్నాం అని ప్రకటించాడు దర్శకుడు అనిల్. సంక్రాంతికి వస్తున్నాంతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి. ఆ తర్వాతే చిరంజీవితో మూవీ అనే ప్రపోజల్ రావడం అనిల్ తనదైన శైలిలో ఆల్రెడీ అనుకున్న లైన్ చెప్పడం.. దానికి మెగాస్టార్ ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి. సంక్రాంతికి వస్తున్నాం విజయోత్సవాలు పూర్తి కాగానే ఏ మాత్రం లేట్ లేకుండా వెంటనే తన టీమ్ తో వైజాగ్ లో వాలిపోయాడు అనిల్. అక్కడే ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రిపేర్ చేసి చిరంజీవికి వినిపించి ఓకే చేయించుకున్నారు. సెకండ్ హాఫ్ ను హైదరాబాద్ లోనే రాసుకున్నారు. తాజాగా ఫుల్ స్క్రిప్ట్ నెరేషన్ పూర్తి చేశాన అని అని చెబుతూ.. ‘‘ఫైనల్ స్క్రిప్ట్ నెరేషన్ అయిపోయింది. చిరంజీవి గారికి నా కథలోని పాత్ర ‘శంకర వరప్రసాద్’ని పరిచయం చేశాను. ఆయనకు బాగా నచ్చింది. విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఇంకెందుకు లేటు, త్వరలో ముహూర్తంతో ‘చిరు’నవ్వుల పండగబొమ్మకి శ్రీకారం’’ అంటూ ఓ లెటర్ విడుదల చేశాడు అనిల్.

మొత్తంగా త్వరలోనే ప్రారంభం కూడా ఉండబోతోంది. చాలా వరకూ ఉగాదికే అఫీషియల్ గా స్టార్ట్ చేస్తారు అంటున్నారు. సో.. ఇక హీరోయిన్ తో పాటు ఇతర కాస్టింగ్ కూడా ఫైనల్ చేస్తూనే ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే విడుదల చేసేలా ఈ మూవీని స్టార్ట్ చేయబోతున్నారు.

Tags:    

Similar News