Revolver Rita : రివాల్వర్ రీటా రిలీజ్ డేట్ అనౌన్స్

Update: 2025-11-12 05:28 GMT

కీర్తి సురేష్ మూవీ రివాల్వర్ రీటా ఫైనల్ గా మోక్షం దక్కించుకుంది. లాస్ట్ ఇయరే విడుదల కావాల్సిన మూవీ ఇదే. కానీ లేట్ అయింది. ఫైనల్ గా రిలీజ్ టైమ్ ఫిక్స్ చేసుకుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో హీరో అనేది ఫిక్స్ కాలేదు. నిజానికి 1970లో ఇదే టైటిల్ తో ఓ తమిళ్ మూవీ రూపొందింది. మళ్లీ అదే టైటిల్ తో రూపొందుతున్న మూవీ కావడం విశేషం. 2024 మే 1 చిత్రీకరణ పూర్తి చేసుకుంది మూవీ.ఇప్పటి వరకు విడుదల విషయంలో మాత్రం తేలలేదు. ఫైనల్ గా ఈ నెల 28నే విడుదల చేయబోతున్నారు అని ప్రకటించారు.

జేకే చంద్ర డైరెక్ట్ చేసిన సినిమా రివాల్వర్ రీటా. ఈమె టైటిల్ మాత్రం ఇమ్మీడియొట్ గా కనెక్ట్ అవుతుంది అనే చెప్పాలి. కీర్తి సురేష్ సింగిల్ గా నటిస్తోన్న మూవీ కాబట్టి ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు కూడా ఉన్నాయి.కాకపోతే యేడాదికి పైగా విడుదలవుతోంది మూవీ. 2024 నవంబర్ లో విడుదల చేయాలనుకుంటున్నారు. అనుకోని కారణాలతో యేడాది తర్వాత రిలీజ్ అవుతోంది. మరి కీర్తి సురేష్ ఈ మూవీ ప్రమోషన్స్ కు వస్తుందా లేదా అనేది చూడాలి. శరత్ కుమార్ మాత్రం ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. 

Tags:    

Similar News