Roshan : ఇద్దరు అవుట్ అయిన డైరెక్టర్స్ తో రోషన్ డిస్కషనా..?

Update: 2025-12-27 16:06 GMT

రోషన్.. ఛాంపియన్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఛాంపియన్ మూవీలో అతని నటన, పాత్ర బాగా కనెక్ట్ అయింది. దీనికి తోడు ఎలాంటి పాత్ర అయినా చేయగలడు అనిపించుకున్నాడు. కాబోయే స్టార్ మెటీరియల్ అనే టాక్ కూడా వచ్చేసింది. మంచి లైనప్ సెట్ అయితే అతను ఖచ్చితంగా పెద్ద స్టార్ అయిపోగలడు అంటున్నారు చాలామంది. ప్రస్తుతం ఛాంపియన్ సక్సెస్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తర్వాత అతను చేయబోయే మూవీస్ విషయంలో ఓ టాక్ వినిపిస్తోంది. అది కూడా ఇద్దరు దర్శకులతో చేయబోతున్నాడు అంటున్నారు. బట్ ఆ ఇద్దరూ ఆల్మోస్ట్ ఇబ్బంది పెట్టిన దర్శకులే కావడం ఇక్కడ విశేషం.

రోషన్ ఒకటి గౌతమ్ మీనన్ తో సినిమా టాక్స్ సాగుతున్నాయి అనే వార్త వినిపిస్తోంది. మరోటి శైలేంద్ర డైరెక్షన్ లో సినిమా అంటున్నారు. బట్ గౌతమ్ మీనన్ ఆల్మోస్ట్ ఫేడవుట్ అయిపోయాడు. అతను డైరెక్ట్ చేసిన ధృవ నక్షత్రం సినిమా ఇప్పటి వరకు విడుదల కాలేదు. అంతకు ముందు కూడా అతను చేసిన మూవీస్ లో కూడా పస లేదు అనిపించుకున్నాడు. అలాంటి దర్శకుడితో రోషన్ డిస్కషన్స్ లో ఉన్నాడు అనే మాట కూడా క్లారిటీగా లేదు. పైగా చాలామందికి నచ్చని మాట కూడా అది.

ఇక డాక్టర్ శైలేష్ కొలను విషయంలో కూడా ఇదే వినిపించింది. అతను హిట్ మూవీస్ ఫ్రాంఛైజీతో హిట్ కొట్టాడు. బట్ హిట్ 3కంటే ముందు వెంకటేష్ తో చేసిన సైంధవ్ మూవీతో బిగ్గెస్ట్ డిజాస్టర్ చూశాడు. అసలు ఎలా చూసినా ఈ మూవీలో ఒక్క సీన్ కూడా నచ్చదు అనిపించుకుంది. ఆ తర్వాత హిట్ 3 చేశాడు. బట్ ఈ మూవీలో చాలా మూవీస్ విషయంలో ఇన్స్ స్పైర్ అయినట్టు కనిపిస్తాడు. పైగా విపరీతమైన వయొలెన్స్ తో కనిపించాడు. అదీ ఈ మూవీలో అవసరం లేని విధంగా, ఫోర్స్ డ్ గా వయొలెన్స్ తో ఉన్నాడు. ఇంకా చూస్తే నాని ప్రభావంతోనే ఈ మూవీ రూపొందించినట్టు కనిపిస్తోంది. సో.. ఇలాంటి దర్శకుడితో రోషన్ మూవీ అంటే మాగ్జిమం రిస్క్ చేయడం అనే చెప్పాలి. కాకపోతే ఈ విషయం ముందుగానే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఇంకే కొత్త దర్శకుడు లేదంటే ఆల్రెడీ హిట్స్ లో ఉన్న దర్శకులతోనే రోషన్ చేయాలి. అప్పుడే అతని కటౌట్ కు తగ్గ కంటెంట్స్ పడతాయి. లేదంటే అంతే సంగతులు. 

Tags:    

Similar News