Mahesh Babu : హరిహర విషయం తేలింది.. ఖలేజాపై క్లారిటీ వచ్చినట్టేనా..?

Update: 2025-05-08 11:00 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా మూవీకి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మూవీ కూడా అతడులాగా థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు కానీ టివిల్లో బ్లాక్ బస్టర్. ఎప్పుడు చూసినా అస్సలు బోర్ కొట్టని కామెడీ ఈ మూవీలో కనిపిస్తుంది. దైవత్వం అనే కాన్సెప్ట్ ను కాస్త కన్ఫ్యూజింగ్ గా చెప్పాడు త్రివిక్రమ్. కానీ కామెడీ యాంగిల్ లో మహేష్ బాబు టైమింగ్ ను ఈ మూవీలో వాడినట్టు మరే సినిమాలో ఎవరూ వాడలేదు. అనుష్క సైతం అమాయకంగా అదరగొట్టేస్తుంది. సునిల్, అలీ కామెడీ మరో హైలెట్. సాంగ్స్ సైతం సూపర్బ్ అనేలా ఉంటాయి. అలాంటి చిత్రాన్ని మరోసారి థియేటర్స్ లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

ఖలేజా రీ రిలీజ్ డేట్ గా ఈ నెల 30ని ఫిక్స్ చేసుకున్నారు. కానీ ప్రస్తుతం ఆ డేట్ కు రాకపోవచ్చు అని తెలుస్తోంది. అందుకు కారణం అదే డేట్ లో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదల ఉంది. అందుకే కాస్త ఆగాలనుకున్నారు. బట్ తాజాగా హరిహర వీరమల్లు డేట్ తేలింది. ఈ చిత్రాన్ని జూన్ 12న విడుదల చేయబోతున్నారు. సో.. ఇక ఖలేజాను ఈ నెల 30న విడుదల చేయడానికి ఏ ఇబ్బందీ లేదు అనుకోవచ్చు. ఈ చిత్రాన్ని కూడా ఈ టెక్నాలజీకి అనుగుణంగా 4 కే లోకి మార్చారు. మంచి క్వాలిటీతో విడుదల చేస్తున్నారు.

విశేషం ఏంటంటే.. మే 30న విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ ఉంది. అయితే రీ రిలీజ్ లు ఫస్ట్ రిలీజ్ లకు పెద్దగా ఇబ్బందేం కాదు. కానీ పవన్ కళ్యాణ్ తో పాటుగా వస్తే అభిమానుల్లో అభిప్రాయ భేదాలు వస్తాయనే కారణంతోనే ఖలేజా రీ రిలీజ్ చేయాలనుకున్నవాళ్లు ఆలోచించి ఉంటారు అనుకోవచ్చు.

Tags:    

Similar News