Rajamouli Assets : రాజమౌళి ఆస్తి ఎన్ని కోట్లు .. ఒక్కో సినిమాకి ఆయన రెమ్యునరేషన్ ఎంత?

Rajamouli Assets : 1973 అక్టోబర్ 10న హైదరాబాద్ లో జన్మించారు రాజమౌళి... ఆయన పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ కుమారుడే ఈ రాజమౌళి..

Update: 2022-03-14 16:12 GMT

Rajamouli Assets : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకరు.. బాహుబలి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన ఘనత ఆయనే దక్కుతుంది. బాహుబలితో వండర్ క్రియేట్ చేసిన జక్కన్న.. ఇప్పుడు త్రిబుల్ ఆర్ మూవీతో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్దమయ్యాడు... ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ త్రిబుల్ ఆర్ మూవీ మార్చ్ 25న భారీ అంచనాల నడుమ థియేటర్ లోకి రానుంది. ఈ క్రమంలో రాజమౌళికి సంబంధించిన అనేక విషయాల గురించి నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. అందులో భాగంగానే... రాజమౌళి ఆస్తి ఎన్ని కోట్లు ఉంటుంది.. ఒక్కో సినిమాకి ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసుకోవాల్సిన ఆసక్తి నెలకొంది.

1973 అక్టోబర్ 10న హైదరాబాద్ లో జన్మించారు రాజమౌళి... ఆయన పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ కుమారుడే ఈ రాజమౌళి.. కుటుంబ సభ్యులు రాజమౌళిని నంది అని పిలుస్తారు. బాహుబలి సినిమాలో మహేంద్ర బాహుబలి పాత్రకు శివుడు కంటే ముందు నంది అనే పేరును పెట్టారు జక్కన్న.. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ వద్ద సుమారుగా ఆరేళ్లపాటు సహాయకుడిగా పనిచేశారు రాజమౌళి.. ఆ సమయంలో తన కథలను పలువురు దర్శకులకు చెప్పేవారు రాజమౌళి. కానీ వాళ్ళు రాసుకున్న కథలను అనుకున్న విధంగా దర్శకులు తెరకెక్కడం లేదని తానే దర్శకుడిగా మారలని అనుకున్నారు రాజమౌళి.

కె. రాఘవేంద్రరావు నిర్మించిన శాంతినివాసం సీరియల్‌‌కి దర్శకత్వం వహించారు రాజమౌళి.. ఆ తర్వాత దర్శకేంద్రుడి దర్శకత్వ పర్యవేక్షణలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు రాజమౌళి.. ఆ తర్వాత సింహాద్రి, చత్రపతి, విక్రమార్కుడు, మగధీర, ఈగ బాహుబలి సినిమాలతో తన రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. దర్శకుడు శంకర్ తర్వాత ఫ్లాప్స్ లేని దర్శకుడు రాజమౌళినే కావడం విశేషం. భారతీయ పౌరాణిక కథలపై రాజమౌళికి మక్కువ ఎక్కువ. మునుపెన్నడూ చూడని స్థాయిలో మహాభారతాన్ని అతిపెద్ద చలనచిత్రంగా రూపొందించాలని జక్కన్న డ్రీమ్.. దీనికి దాదాపుగా 10 సంవత్సరాల సమయం పడుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారాయన.

ఇక రాజమౌళి ఆస్తుల విషయానికి వచ్చేసరికి తసుమారుగా రూ. 148 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. గత మూడేళ్ళలలో ఆయన ఆస్తులు 40% పెరిగాయట. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అత్యాధునికమైన సౌకర్యాలతో 2008లో ఓ ఇల్లును కొనుగులు చేశారు రాజమౌళి.. ఆయనకి పలు రియల్ ఎస్టేట్ ఆస్తులు కూడా ఉన్నట్టు సమాచారం. రాజమౌళి వాడుతున్న కార్లు కూడా హైక్లాస్ వే.. ప్రస్తుతం ఆయన దగ్గర రేంజ్ రోవర్, BMW కార్లు ఉన్నాయి. ఒక్కో కారు ధర కోటి నుండి 1.5 కోట్ల వరకు ఉంటుంది.. అయితే రాజమౌళి దర్శకుడు అయ్యాకే ఇన్ని ఆస్తులు సంపాదించారట.. ఇక బాహుబలికి ముందు రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్న రాజమౌళి.. బాహుబలి నుంచి రెమ్యునరేషన్ తో పాటుగా లాభాల్లో 30% వాటాను కూడా తీసుకుంటున్నారట.. ఒక్కో సినిమాకి ఆయన రెమ్యునరేషన్ రూ. 24 కోట్లు ఉంటుందని సమాచారం.

Tags:    

Similar News