RRR OTT: ప్రేక్షకులకు షాక్.. ఓటీటీలో 'ఆర్ఆర్ఆర్' చూడాలన్నా టికెట్ కొనాల్సిందే..

RRR OTT: ఇప్పటివరకు చాలా తక్కువ తెలుగు సినిమాలు మాత్రమే పే పర్ వ్యూ ఫార్మాట్‌లో విడుదలయ్యాయి.

Update: 2022-05-07 10:23 GMT

RRR OTT: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మల్టీ స్టారర్ 'ఆర్ఆర్ఆర్' ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే ప్రేక్షకులు ఇప్పటికీ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా విడుదలయిన నెలరోజల వరకు కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇక ఫైనల్‌గా ఆర్ఆర్ఆర్.. ఓటీటీలో సందడి చేయాల్సిన టైమ్ వచ్చేసింది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.

లాక్‌డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలయిన కొన్ని సినిమాలు పే పర్ వ్యూ ఫార్మాట్‌లో విడుదలయ్యాయి. అంటే ఓటీటీలో సినిమా చూడాలన్నా కూడా టికెట్ తీసుకోవాలన్నమాట. ఇప్పటివరకు చాలా తక్కువ తెలుగు సినిమాలు మాత్రమే అలా విడుదలయ్యాయి. అది కూడా.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయినవి మాత్రమే. కానీ మొదటిసారి థియేటర్లలో విడుదలయిన తర్వాత కూడా ఓటీటీలో రిలీజ్ అవ్వలంటే పే పర్ వ్యూ ఫార్మాట్‌లో ఫాలో అవ్వాలంటోంది 'ఆర్ఆర్ఆర్'.

ఆర్ఆర్ఆర్ విడుదలకు అవ్వకముందే భారీ పెట్టుబడితో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది జీ5, నెట్‌ఫ్లిక్స్. ఇక మే 20న ఆర్ఆర్ఆర్ జీ5లో విడుదల కానుందని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా మే చివరి వరకు జ5లో సినిమా చూడాలంటే డబ్బులు చెల్లించక తప్పదని కూడా సమాచారం. ఇక ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Tags:    

Similar News