RRR Movie Tickets : ఏపీలో ఇప్పుడున్న టికెట్ రేట్లు గిట్టుబాటు కాదు: దానయ్య
RRR Movie Tickets : ఏపీలో టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు సినీ నిర్మాత దానయ్య.;
RRR Tickets : ఏపీలో టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు సినీ నిర్మాత దానయ్య. RRR సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన కారణంగా ఇప్పుడున్న టికెట్ రేట్లు గిట్టుబాటు కాదని అంగీకరించారు. ఈ విషయంపై నిర్మాతగా ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టుగా తెలిపారు. కాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటించారు. ఈ మధ్యే రిలీజైన ట్రైలర్ కి వీపరితమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. సినిమా నిడివి దాదాపు మూడు గంటల ఆరు నిమిషాల 54 సెకన్ల నిడివి ఉందట. వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.