Ruchi Gujjar : కరణ్ సింగ్ ను చెప్పుతో కొట్టిన నటి

Update: 2025-07-26 07:30 GMT

సినిమా ఇండస్ట్రీలో స్నేహాలే కాదు.. పగలూ, ద్వేషాలు, మోసాలూ ఉంటాయి. వీటి విషయంలో ఓపెన్ గా ఎవరరూ మాట్లాడుకోరు. బట్ రుచి గుజ్జర్ అనే నటి మాత్రం తనను మోసం చేశాడని నటుడు, నిర్మాత కూడా అయిన కరణ్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తిని అందరి ముందూ చెప్పుతో కొట్టడం వైరల్ అవుతోంది. మోసం చేయడం అనగానే చాలా వరకూ సినిమా పరిశ్రమల్లో శారీరకంగా వాడుకుని ఇబ్బంది పెట్టాడు లాంటి మాటలు వినిపిస్తాయి. కానీ ఇక్కడ అది కాదు. అతగాడు ఆమె వద్ద డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడట. ఆ కోపంతోనే ఆమె చెప్పు తీసుకుని కొట్టింది.

 

సదరు కరణ్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి ఈమె వద్ద 24లక్షలు అప్పుగా తీసుకున్నాడట. తిరిగి ఇవ్వకపోగా తనను మోసం చేశాడట. దీంతో అతనిపై ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కేస్ కూడా పెట్టింది. అయినా కోపం చల్లారలేదేమో.. రీసెంట్ గా ముంబైలో ‘సో లాంగ్ వ్యాలీ’అనే మూవీ స్క్రీనింగ్ సందర్భంగా ఇద్దరూ ఎదురయ్యారట. వెంటనే అమ్మడు ఇలా చెప్పుకు పని చెప్పింది. ప్రస్తుతం ఈ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

Tags:    

Similar News