విజయ్ దేవరకొండ, రవి కిరణ్ కోలా దర్శకుడితో ఓ మూవీకి సైన్ చేశాడు. ఈ సినిమాకు తాత్కాలికంగా 'వీడీ14' అని పేరు పెట్టారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. రుక్మిణి వసంత్ కన్నడ సినిమాల్లో నటించింది.
ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం రుక్మిణి వసంత్ తో చివరి దశ చర్చలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే ఆమె ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. రుక్మిణి వసంత్ 'సప్త సాగరాలు దాటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది. ఈ ముద్దుగుమ్మ అందాలకు టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ అందాల బొమ్మ విజయ్ కు జంటగా చేస్తే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కు ఏ పాత్ర ఇస్తారో ఆమెకు చెప్పగానే, ఆ పాత్ర ఆమెకు చాలా బాగా నచ్చిందట. అందుకే ఆమె విజయ్ దేవరకొండ సినిమాలో నటించాలని అనుకుంటున్నారట.
వీడీ14 అనే ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున ఒక యాక్షన్ డ్రామా. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అనే పెద్ద నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. 2025లో మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.