Chiranjeevi : చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల మూవీపై రూమర్స్ .. అసలు నిజాలేంటీ
మెగాస్టార్ చిరంజీవి కొత్త దర్శకులకు మంచి అవకాశాలు ఇస్తున్నాడు. ఆయనతో మూవీ చేసి బ్లాక్ బస్టర్ కొడితే ఒకేసారి టాప్ రేస్ లోకి వచ్చేయొచ్చు. ప్రస్తుతం బింబిసార ఫేమ్ విశిష్టకు ‘విశ్వంభర’తో ఛాన్స్ ఇచ్చాడు. జగదేకవీరుడు అతిలోక సుందరి తర్వాత ఆ తరహా ఫాంటసీ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. విశ్వంభరను సమ్మర్ లో విడుదల చేసే అవకాశాలున్నాయంటున్నారు.
విశ్వంభర తర్వాత చాలామంది దర్శకుల పేర్లు వినిపించాయి. ఆ ఛాన్స్ ను దసరాతో బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రీకాంత్ ఓదెలకు ఇచ్చాడు. ఇది మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని వీరి ఓపెనింగ్ రోజునే రక్తంతో తడిచిన చేతులు చూపిస్తూ ఓ ఫీలర్ వదిలారు. ప్రస్తుతం విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. మెగాస్టార్ కొంత గ్యాప్ తీసుకుంటున్నాడు. ఇటు శ్రీకాంత్ ఓదెల మళ్లీ నానితోనే ‘ది పారడైజ్’అనే మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే చిరంజీవి ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. అయితే ఈ మూవీకి సంబంధించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
చిరు - శ్రీకాంత్ మూవీ ఆగిపోయిందన్నారు కొందరు. కానీ ఆగలేదు. అలాగే ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని.. అస్సలు హీరోయిన్ ఉండదు, ఒక్క పాట కూడా ఉండదు అనేది మరో రూమర్. ఇదీ నిజం కాదు. మెగాస్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఓ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ నే శ్రీకాంత్ అందించబోతున్నాడు. మరి కమర్షియల్ ఎంటర్టైనర్ అంటే పాటలూ, డ్యాన్సులూ లేకుండా ఉంటుంది. అదీ మెగాస్టార్ మూవీకి. సో.. ఇవన్నీ కంప్లీట్ గా రూమర్స్. అన్నీ కుదిరితే ఈ ప్రాజెక్ట్ 2025 సమ్మర్ లోనే అఫీషియల్ గా ప్రారంభం అవుతుంది.