RRR Movie: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్ అప్పుడే..
RRR Movie: పాన్ ఇండియా రేంజ్‌లో రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.;
RRR Movie (tv5news.in)
RRR Movie: పాన్ ఇండియా రేంజ్‌లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఒకటి తర్వాత ఒకటి అప్డేట్స్‌తో అటు రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు, ఇటు ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌కు సినిమాపై అంచనాలు పెంచేస్తు్న్నాడు రాజమౌళి. అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టే ప్లాన్‌లో జక్కన్న ఉన్నట్టుగా సమాచారం. తాజాగా ఈ సినిమా గురించి మరో రూమర్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.
ఆర్ఆర్ఆర్ గ్లింప్స్‌కు మామూలు ఆదరణ దక్కలేదు. ఈ గ్లింప్స్‌లో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ చాలా తక్కువసేపే కనిపించినా.. ఎప్పటిలాగానే తన విజువల్స్‌తో మార్కులు కొట్టేశాడు రాజమౌళి. ఇక ఈ సినిమా నుండి విడుదలయిన 'నాటు నాటు' పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పాట క్రేజ్ ఇండియాను దాటిపోయి అంతర్జాతీయ స్థాయి వరకు చేరిపోయింది.
ఆర్ఆర్ఆర్ గ్లింప్స్‌లో ఒక్క డైలాగ్ కూడా లేదు. అందుకే పవర్‌ఫుల్ డైలాగులతో ట్రైలర్‌ను విడుదల చేయనుందట ఆర్ఆర్ఆర్ టీమ్. అయితే ఆ ట్రైలర్ విడుదల తేదిపై సోషల్ మీడియాలో ఓ రూమర్ మొదలయింది. డిసెంబర్ 4న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుందని నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వార్త నిజమయితే బాగుంటుందని ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.