Acharya: 'ఆచార్య' సినిమాలో అనుష్క..! 16 ఏళ్ల తర్వాత..
Acharya: చిరంజీవి, అనుష్క కాంబినేషన్‌ను టాలీవుడ్ ప్రేక్షకులు కలిసి చూడాలని ఎంతోకాలం నుండి కోరుకుంటున్నారు.;
Acharya: మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆచార్య'. చిరంజీవి, రామ్ చరణ్‌ల మల్టీ స్టారర్ కావడంతో ఈ సినిమాపై అంచనాల భారీగానే ఉన్నాయి. శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమాకు ప్రీ బుకింగ్ కూడా బాగానే జరుగుతోంది. ఇక ఈ సినిమా నుండి ఓ స్వీట్ సర్‌ప్రైజ్ ఉందంటూ టాలీవుడ్‌లో రూమర్స్ వినిపిస్తు్న్నాయి.
ముందుగా ఆచార్యలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేశాడు కొరటాల శివ. కానీ కథాపరంగా చిరు క్యారెక్టర్‌కు హీరోయిన్ లేకపోతేనే బాగుంటుందని భావించి కాజల్‌కు చెప్పగా తాను తప్పుకుంది. అయితే ఒక సీన్‌లో చిరు పక్కన ఒక హీరోయిన్ మాత్రం తప్పనిసరి అనిపించిందట. అందుకే అనుష్క ఆ సీన్‌లో నటించిందంటూ సమాచారం.
చిరంజీవి, అనుష్క కాంబినేషన్‌ను టాలీవుడ్ ప్రేక్షకులు కలిసి చూడాలని ఎంతోకాలం నుండి కోరుకుంటున్నారు. కానీ ఎందుకో ఇప్పటివరకు ఈ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. కానీ అనుష్క హీరోయిన్‌గా పరిచయం అవ్వకముందు చిరంజీవి నటించిన 'స్టాలిన్' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్. ఇక 16 ఏళ్ల తర్వాత ఆచార్య సినిమాలో చిరంజీవితో కాసేపు తళుక్కుమననుందట అనుష్క.