Coolie Pre Sales : ప్రీ సేల్స్ లో అదరగొడుతున్న కూలీ

Update: 2025-08-09 10:54 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్,లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తోన్న ఫస్ట్ మూవీ కూలీ అడ్వాన్స్ బుకింగ్స్ తో అదరగొడుతోంది. ఈ మూవీ దెబ్బకు బుక్ మై షో షేక్ అయిపోతోంది. ఇండియాలోనే కాదు.. అబ్రాడ్ లో కూడా అదే దూకుడు కనిపిస్తోంది. భారీ మల్టీస్టారర్ లాంటి సినిమా కూడా కావడంతో అందరు హీరోల ఫ్యాన్స్ కూడా ఈ మూవీ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కూలీతో పాటు హిందీ నుంచి వార్ 2 కూడా విడుదలవుతున్నా.. ఆడియన్స్ లో ఎక్కువ క్రేజ్ మాత్రం కూలీకే ఉండటం విశేషం.

అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఇప్పటికే వాల్డ్ వైడ్ గా 50 కోట్ల మార్క్ ను దాటేసింది కూలీ. బుక్ మై షో యాప్ లో 5లక్షలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి.. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అటు యూఎస్ఏలో 1.34 మిలియన్ టికెట్స్ తెగిపోయాయి. నార్త్ అమెరికాలో 1.59 ప్లస్ గా ఉంది. ఇవన్నీ గంట గంటకూ పెరుగుతూనే ఉన్నాయి. చూస్తుంటే రజినీకాంత్ ఈ ఏజ్ లో కూడా సరికొత్త రికార్డులు నెలకొల్పబోతున్నాడు అనుకోవచ్చు.

రజినీకాంత్ కు విలన్ గా మన నాగార్జున నటిస్తున్న ఈ మూవీలో ఇంకా ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతి హాసన్, సౌబిర్ షబీన్ లు కీలక పాత్రలు చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

Tags:    

Similar News