Sachiin Joshi: మనీలాండరింగ్ కేసులో టాలీవుడ్ హీరోకు బెయిల్.. కానీ..

Sachiin Joshi: 2021లో రూ. 410 కోట్ల బ్యాంకు సొమ్మును మళ్లించిన ఆరోపణలపై ఈడీ సచిన్‌ను అరెస్ట్ చేసింది.

Update: 2022-03-09 10:15 GMT

Sachiin Joshi (tv5news.in)

Sachiin Joshi: కొందరు సెలబ్రిటీ స్టేటస్‌ను సంపాదించుకున్న తర్వాత వారిపై పడే కొన్ని ఆరోపణలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. కొందరు వాటి వల్ల జైలుశిక్షను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. తెలుగు హీరో అనిపించుకున్న హీరో సచిన్ జోషి. 2021లో మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లిన ఈ నటుడికి ఇటీవల బెయిల్‌తో ఊరట లభించింది.


'మౌనమేలనోయి' సినిమాతో బిజినెస్‌మెన్ నుండి హీరోగా మారాడు సచిన్ జోషి. ఆ తర్వాత అప్పుడప్పుడు పలు తెలుగు సినిమాల్లో మెరిసాడు. తన సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయినా.. మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. 2017లో విడుదలయిన 'వీడెవడు'.. సచిన్ హీరోగా నటించిన చివరి చిత్రం. అంతే కాకుండా సెలబ్రిటీ క్రికెట్ లీగ్స్‌లో కూడా సచిన్ చురుగ్గా పాల్గొనేవాడు. అలాంటి సచిన్ 2021లో జైలుపాలయ్యాడు.

2021లో రూ. 410 కోట్ల బ్యాంకు సొమ్మును మళ్లించిన ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సచిన్‌ను అరెస్ట్ చేసింది. తాజాగా ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు అయ్యింది. రూ. 30 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో తనకు బెయిల్ మంజూరు చేసింది స్పెషల్ కోర్టు. కానీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఇండియా నుండి వెళ్లొద్దని, పాస్‌పోర్ట్‌ను ఈడీ అధికారులకు అప్పగించాలని ఆదేశించింది.

Tags:    

Similar News