ఆర్థిక మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం అందించారు. ఆమెకు రూ.లక్ష రూపాయల సహాయం అందించాడు. సాయి ధరమ్ అందించిన సహాయానికి పావలా శ్యామల భావోద్వేగానికి గురయ్యారు. కొన్నేళ్ల క్రితం మా అమ్మాయికి ఆపరేషన్ జరిగినప్పుడు సాయిధరమ్ నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. వచ్చి కలుస్తా అనికూడా చెప్పారు. రాలేదు. నన్ను మర్చిపోయారేమో అనుకున్నాను. కానీ, గుర్తుపెట్టుకొని మరీ ఇప్పుడు నాకు సాయం అందించారు. అందుకు ఆయనకు నా ధన్యవాదాలు.. అని తెలిపారు పావలా శ్యామల. ఇక పావలా శ్యామల విషయానికి వస్తే.. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో హాస్యనటి, సహాయనటిగా కనిపించారు పావలా శ్యామల. మనసంతా నువ్వే, గోలీమార్, ఆంధ్రావాలా, ఖడ్గం వంటి చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం మత్తువదలరా. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో ఆమె సినిమాలు చేయలేదు.