Sathyadev Krishnamma : సత్యదేవ్ కృష్ణమ్మ కథేంటంటే..

Sathyadev Krishnamma : థ్రిల్లర్, ఎమోషనల్ కథలతో ఎంటర్టైన్ చేసే సత్యదేవ్ మరో మంచి సినిమా ‘కృష్ణమ్మ’తో మనముందుకు వచ్చారు;

Update: 2022-08-05 05:36 GMT

Sathyadev Krishnamma : థ్రిల్లర్, ఎమోషనల్ కథలతో ఎంటర్టైన్ చేసే సత్యదేవ్ మరో మంచి సినిమా 'కృష్ణమ్మ'తో మనముందుకు వచ్చారు. వి.వి గోపాలకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. హీరో సాయిధరంతేజ ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.

ఒక నిమిషం 23 సెకన్లు ఉన్న ఈ టీజర్ ఆద్యాంతం థ్రిల్లర్ మాస్ ప్యాక్డ్‌గా ఉంది. ఒక చిన్న పట్టనంలో ముగ్గురు స్నేహితులు ఓ విలన్‌కు మధ్య జరిగే ఘర్షనే ఈ కృష్ణమ్మ కథ. టీజర్‌లో సత్యదేవ్ చెప్పిన.. 'కథ నడక, నది నడతా ప్రశాంతంగా సాగిపోవాలంటే ఎవ్వడూ గెలక్కూడదు. కానీ, గెలికారు' డైలాగ్స్ చాలా బాగున్నాయి. అయితే మూవీ రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. 

Tags:    

Similar News