Sai Durga Tej : దూకుడు పెంచుతున్న సాయిదుర్గా తేజ్

Update: 2025-07-19 06:30 GMT

ఒక సినిమా కోసం ఎక్కువ టైమ్ కేటాయిచడం అంటే ఆ స్క్రిప్ట్ పై నమ్మకం అని చెప్పాలి. ఈ మధ్య చాలామంది హీరోలు అలాగే చేస్తున్నారు. అయితే టైర్ 2 హీరోలు కూడా అంత టైమ్ తీసుకోవడం అంటే ఆశ్చర్యమే. అదే చేస్తున్నాడు సాయి దుర్గా తేజ్. 2023 లో విరూపాక్ష, బ్రో మూవీస్ తో వచ్చాడు. అంతే.. తర్వాత సంబరాల ఏటిగట్టు అనే చిత్రం కోసం అప్పటి నుంచి టైమ్ కేటాయించాడు. మేకోవర్ కోసమే ఆరు నెలలు టైమ్ తీసుకున్నాడు.కేపి రోహిత్ అనే దర్శకుడు రూపొందిస్తోన్న ఈ మూవీపైనే పూర్తిగా ఫోకస్ చేశాడు. సెప్టెంబర్ 25న విడుదల చేయాలనుకున్నారు ఈ చిత్రాన్ని. ఆ డేట్ లోనే పవన్ కళ్యాణ్ ఓ.జి వస్తోంది కాబట్టి పోస్ట్ పోన్ అవుతుందని చెప్పొచ్చు. ఇక సంబరాల ఏటిగట్టు షూటింగ్ చివరి దశకు వచ్చింది. అందుకే కొత్త ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేస్తున్నాడు సాయిదుర్గాతేజ్.

ఇంతకు ముందు రవితేజతో టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు వంశీతో సినిమా ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుందని టాక్. అంటే దర్శకుడు చెప్పిన కథ ఫైనల్ అయితే ఈ బ్యానర్ రెడీగా ఉందన్నమాట. అలాగే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లోనూ మరో సినిమా చేయబోతున్నాడు సాయి. ఈ రెండు చిత్రాలను ఒకేసారి రూపొందించే ప్లాన్ లో ఉన్నారు. అంటే ఈ ఆలస్యాన్ని ఆ రెండు సినిమాలతో ఫిల్ చేయాలనుకుంటున్నాడు అన్నమాట.

Tags:    

Similar News