Sai Pallavi : ‘ఏక్ దిన్’లో సాయి పల్లవి

Update: 2026-01-17 12:53 GMT

మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకుంది. మళయాలంలో మొదలు పెట్టి తెలుగులో వెలిగిపోయింది. తమిళ్ లో సత్తా చాటింది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగులు మొదలు పెడుతోంది. ఆల్రెడీ రామాయణలో సీత పాత్రతో అడుగు పెడుతోంది. ఈ యేడాది దీపావళి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ పార్ట్ విడుదల కాబోతోంది. అయితే అంతకు ముందే తన హిందీ ఎంట్రీ ఇవ్వబోతోంది. తన ఫస్ట్ మూవీ రామాయణ అయినా ఫస్ట్ విడుదల కాబోతోన్న మూవీ మాత్రం ‘ఏక్ దిన్’. ఈ టైటిల్ తో రూపొందుతోన్న మూవీ టీజర్ విడుదలైంది.

ఆమిర్ ఖాన్ ప్రొడ్యూస్ చేస్తోన్న మూవీ ఏక్ దిన్. అతని తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించాడు. ఈ టీజర్ చూస్తే కేవలం సాయి పల్లవి మాత్రమే ఈ పాత్రకు సరిపోతుంది అనిపించేలా ఉంది. పూర్తిగా ఈ మూవీ విదేశాల్లో చిత్రీకరణ చేసుకున్నారు అనిపిస్తోంది. హీరోయిన్ ను చూడగానే మనసు పారేసుకున్న హీరో.. ఆమె కోసం ప్రతిక్షణం తపించిపోతుంటాడు. ఆమె కూడా అతనితోనే ఉంటుంది. ఇద్దరి మధ్య ఉండేది ప్రేమా అంతకు మించా అనేది సినిమాలో ఉండబోతోంది అనిపించేలా ఉంది టీజర్. టీజర్ మాత్రం చాలా బావుంది. మే 1న ఈ మూవీ విడుదల చేస్తున్నాం అని ఆల్రెడీ ప్రకటించారు. సునిల్ పాండే డైరెక్ట్ చేస్తున్నాడు.

హిందీ మూవీ కాబట్టి అని కాకుండా కేవలం పాత్రలానే కనిపిస్తుంది సాయి పల్లవి. ఏ మాత్రం స్కిన్ షో లేకుండా, ముద్దులు, హగ్గులు లేకుండా కనిపించేలా ఉందీ మూవీ. మరి ఈ మూవీతో సాయి పల్లవి బెస్ట్ డెబ్యూ ఇస్తుందా లేదా అనేది చూడాలి. 

Full View

Tags:    

Similar News