Sakranthiki Vastunnam : సంక్రాంతికి వస్తున్నాం ఖాతాలో మరో రికార్డ్

Update: 2025-03-04 06:00 GMT

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి గ్రాండ్ గా హ్యాట్రిక్ కొట్టారు. థర్డ్ మూవీతో ఏకంగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అనే టైటిల్ తో పాటు ఆ రేంజ్ కలెక్షన్స్ కూడా కొల్లగొట్టారు. ఈ యేడాది సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. వెంకటేష్ కెరీర్ లో ఇదే హయ్యొస్ట్ మూవీ ఇదే. సంక్రాంతి టైమ్ లో తెలుగు ఆడియన్స్ ఏ తరహా మూవీస్ ను ఇష్టపడతారో పర్ఫెక్ట్ గా చూపించిన సినిమా ఇది. అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్టైనర్ తో ఆకట్టుకుంటే అదిరిపోయే టైమింగ్ తో వెంకటేష్ తో సమానంగా అదరగొట్టింది హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్. మీనాక్షి చౌదరి కాంబోలో వచ్చే సీన్స్ అన్నీ అలరించాయి. ఏ మాత్రం అసభ్యత లేకుండా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించుకుంది. సోలో మూవీగా 303 కోట్లు కొల్లగొట్టి ఇప్పటి వరకూ టాలీవుడ్ లో ఎవరూ సాధించని ఫీట్ సాధించింది ఈ మూవీ.

ఇక కలెక్షన్స్ పరంగానే కాదు.. ప్రస్తుతం చాలా పెద్ద సినిమాలకు కూడా అరుదైపోయిన రికార్డ్ ను సాధించింది సంక్రాంతికి వస్తున్నాం. ఈ జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం.. 92 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ఈ రోజుల్లో ఇదో పెద్ద రికార్డ్ అనే చెప్పాలి. రాజమౌళి, ప్రభాస్ లాంటి వారి మూవీస్ కలెక్షన్స్ సాధించినా ఈ ఫీట్ సాధించలేకపోతున్న టైమ్ లో వెంకటేష్ సినిమా సాధించడం విశేషమే. ఇదే కాక ఈ చిత్రం 100 రోజుల పోస్టర్ కూడా వేసుకునేలానే ఉంది.

 

Tags:    

Similar News