Salaar Part 1 – Ceasefire: ట్రైలర్ లో ఇంటర్నేషనల్ సూపర్ స్టార్..!
సలార్ పార్ట్ -1 లో ఇంటర్నేషనల్ కాస్టింగ్ కూడా ఉందా.. ?
ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. అందులో భాగంగా భారీ హైప్ లో ఉన్న లేటెస్ట్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతి హాసన్ హీరోయిన్ గా.. సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'సలారే'. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్ రికార్డు రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇది సినిమాని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్లగా.. ఇప్పుడంతా నెక్స్ట్ విడుదల కాబోయే ఈ మూవీ ట్రైలర్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. దీంతో ఇది మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ గా నిలవనుంది.
ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు మళయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో మరికొందరు ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా నటించారని, ప్రస్తుతానికి వారి పేర్లు మిస్టరీగా ఉన్నట్టు తెలుస్తోంది. అది తెలియాలంటే సలార్ ట్రైలర్ రిలీజ్ దాకా వెయిట్ చేయాల్సిందేనని పలువురు అంటున్నారు. ఇక ఇటీవల రిలీజైన సలార్ టీజర్ టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఎక్కడ చూసినా ప్రభాస్ (Prabhas) ఎలివేషన్స్‌తో పాటు టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ గురించిన చర్చలే కనిపిస్తోన్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టీజర్‌ను కట్ చేసిన తీరు, డైనోసార్‌తో ప్రభాస్‌ను కంపేర్ చేయడం లాంటివి ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ను తెప్పిస్తున్నాయి.
కొందరు అభిమానులు మాత్రం 'సలార్' టీజర్ విషయంలో అసంతృప్తికిలోనవుతున్నారు. సలార్ టీజర్‌లో కనిపిస్తోన్న విజువల్స్, లొకేషన్స్, ఎలివేషన్స్‌తో పాటు టేకింగ్‌కూడా కేజీఎఫ్, కేజీఎఫ్ 2నుపోలి ఉందని కామెంట్స్ చేస్తోన్నారు. సలార్ టీజర్ కాకుండా కేజీఎఫ్ 3 టీజర్ చూసిన అనుభూతి కలుగుతోందని ప్రశాంత్ నీల్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. టీజర్‌లో ప్రభాస్ ఒక్కసారి కూడా కనిపించలేదు. అతడి ముఖం చూపించకుండా యాక్షన్ సీక్వెన్స్‌లతోనే టీజర్‌ను కట్ చేశారు. ప్రభాస్ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ డిసపాయింట్ అయినట్లు సమాచారం
మరో వైపు ఆగస్ట్ నెల స్టార్ట్ కావడంతో అయితే 'సలార్' మంత్ బిగిన్ అయ్యిందనే చర్చ వినిపిస్తోంది. ఇక ఈ అవైటెడ్ ట్రైలర్ ని మేకర్స్ ఆల్రెడీ ఆగస్టులోనే రిలీజ్ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల ఆఖర్లో అయితే ఈ ట్రైలర్ ని మేకర్స్ వదిలే ప్లాన్ లలో ఉన్నట్టుగా టాక్. మరి ఈ ట్రైలర్ వచ్చాక ఎన్ని రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా వివిధ భాషల్లో సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది.
Full View