Salman Khan : సల్మాన్ ఖాన్‌ను కాటేసిన పాము.. ఆసుపత్రిలో చికిత్స..!
Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాముకాటుకు గురయ్యాడు. శనివారం రాత్రి మహారాష్ట్రలోని పన్వేల్‌లోని తన ఫామ్ హౌస్‌లో ఈ ఘటన జరిగింది.;
Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాముకాటుకు గురయ్యాడు. శనివారం రాత్రి మహారాష్ట్రలోని పన్వేల్‌లోని తన ఫామ్ హౌస్‌లో ఈ ఘటన జరిగింది.దీనితో సల్మాన్ ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే సల్మాన్ ని విషం లేని పాము కాటేసిందని, దాని వల్ల అతని ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం ఆదివారం ఉదయం సల్మాన్ తిరిగి తన ఫామ్ హౌస్‌కి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం సల్మాన్ ఆరోగ్యం బానే ఉందని అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని సన్నిహితులు చెబుతున్నారు.