Samantha: ఏ మాయ చేసావేకి 13 ఏళ్లు: చై సామ్ పోస్టులు

ఇద్దరూ ఎంత క్యూట్‌గా ఉన్నారు. ప్రేక్షకులను ఏ మాయ చేశారో.. ఆడియన్స్‌ని ఇద్దరూ ఆకట్టుకున్నారు.

Update: 2023-02-27 06:30 GMT

Samantha: ఇద్దరూ ఎంత క్యూట్‌గా ఉన్నారు. ప్రేక్షకులను ఏ మాయ చేశారో.. ఆడియన్స్‌ని ఇద్దరూ ఆకట్టుకున్నారు. కొందరు తారలు స్క్రీన్ మీద పండించిన కెమిస్ట్రీ వాళ్లిద్దరూ నిజజీవితంలో కూడా ఒక్కటైతే బావుండు అనిపించేలా ఉంటుంది. బహుశా వారిక్కూడా అలానే అనిపించి ఉంటుంది. అందుకే వారి రీల్ బంధాన్ని రియల్ బంధంగా మలుచుకుంటారు చాలా మంది తారలు. అలానే చైసామ్ కూడా వివాహబంధంతో ఒక్కటయ్యారు. కానీ వారి బంధం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. ఆ విషయాన్ని జీర్ణించుకోలేని అభిమానులు ఇప్పటికీ కలత చెందుతూనే ఉన్నారు. ఇప్పటికైనా ఇద్దరూ కలుసుకుంటే బావుంటనే కోరుకుంటున్నారు. ఎందుకు విడిపోయారో ఎవరికీ అర్థం కాని విషయంగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి నటించిన మొదటి చిత్రం ఏ మాయ చేశావేకి ఫిబ్రవరి 26తో 13ఏళ్లు పూర్తి చేసుకుంది. దాంతో ఇద్దరూ విడివిడిగా తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

సమంత 13 ఏళ్ల క్రితం ఏ మాయ చేసావే సినిమాతో తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం సిటాడెల్‌ టీమ్‌తో నైనిటాల్‌లో వర్క్ చేస్తున్న ఆమె ఈ వేడుకను అక్కడి సెట్‌లో జరుపుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజిలో పువ్వుల ఫోటోను పంచుకుంది. నటిగా నా ప్రయాణం మరింత దూరం సాగుతుంది. మీరు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, నాగ చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఏ మాయ చేశావే చిత్రం నుండి రెండు పోస్టర్‌లను పంచుకున్నాడు. ఏ మాయ చేసావే సెట్స్‌లో సమంత, నాగ చైతన్యల స్నేహం చిగురించింది. 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని విభేదాల కారణంగా 2021 అక్టోబర్‌లో ఇద్దరూ విడిపోయారు.


Similar News