దుబాయ్ లో స్టార్ హీరోయిన్ సమంత సందడి చేసింది. ఓ జ్యువెలరీ బ్రాండ్ లాంచ్ సందర్భంగా కొత్త ఫొటోలను షేర్ చేసింది. చీరకట్టులో ఆమె మెరి సిపోయింది. ఈ ఫొటోలు సోషల్ మీడియలో తెగ వైరల్ గా మారాయి.ఈ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఆమె లుక్ నచ్చి చీరకట్టులో ఎంత అందంగా ఉందో అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. సమంత అందమైన ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న లేత పసుపు రంగు చీరలో కనిపించింది. లుక్ కోసం లేస్ డిజైన్ తో సరిపోయే పసుపు రంగు బ్లౌజ్ ను జత చేసి, జుట్టును విప్పి ఎడమ వైపుకు విడదీసింది. ఓ ఫొటోలో హోటల్ గది బాల్కనీలో సమంత ఆమె ఫోజులిచ్చిం ది. మరో ఫొటోలో జ్యువెలరీ బ్రాండ్ నుంచి 'సర్టిఫికేట్ ఆఫ్ ప్రజెంటే షన్'గా బహుమతిగా ఇచ్చిన జ్ఞాపికను ఆమె పట్టుకుంది. ఈ ఫొటోలపై స్పందించిన ఓ అభిమాని 'నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది సామ్! నువ్వు ఎదగడం చూడటం చాలా ఆనందంగా ఉంది' అని పేర్కొన్నా డు. "ఎప్పటికీ ఫేవరెట్. చాలా క్యూట్ గా ఉంది' అని మరో అభిమాని కామెంట్ చేశాడు. ఇదిలా ఉండగా సమంత ఇటీవలే ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ ను ప్రారంభించి నిర్మాతగా మారింది. ఈ బ్యానర్ పై శుభం టైటిల్ తో ఫస్ట్ సినిమాను రిలీజ్ చేసింది.