Samantha Ruth Prabhu : సమంత పెళ్లి చేసుకుంది

Update: 2025-12-01 07:42 GMT

సమంత రూత్ ప్రభు పెళ్లైపోయింది. ఫ్యామిలీ మేన్ మూవీ దర్శకుల్లో ఒకడైన రాజ్ నిడుమోరుతో తన పెళ్లి అయిపోయింది. గత కొంత కాలంగా వీరి మధ్య ప్రేమ సాగుతోంది అనే రూమర్ వినిపించింది. అయితే కొంతమంది మాత్రం వీరి మధ్య రిలేషన్ గురించి నెగెటివ్ గా మాట్లాడారు. ఇంకొందరైతే ఇది కేవలం రూమర్ అని మాత్రమే చెప్పారు. బట్ ఈ రూమర్ ని నిజం చేస్తూ వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కోయంబత్తూరలో వీరి పెళ్లి పూర్తయింది. ఈ పెళ్లిని ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగడం విశేషం. సమంత క్రిస్టియన్ అయినా కూడా కొంత కాలంగా ఈషా ఫౌండేషన్ లో గడపడం జరుగుతోంది. ఈ పెళ్లి తంతు కూడా అక్కడే జరగడం మాత్రం కాకతాళీయం కాదు. తను కావాలనే అక్కడే పెళ్లి చేసుకుంది. మొత్తంగా ఈ కొత్త జంట పెళ్లితో కొత్త జీవితం స్టార్ట్ చేయబోతోంది. రాజ్ నిడమూరు కూడా గతంలోనే విడాకులు తీసుకుని ఉన్నాడు. 

Tags:    

Similar News