Samantha: బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాలకు సామ్ గ్రీన్ సిగ్నల్.. ఆ స్టార్ హీరోలతో కలిసి..
Samantha: సమంత.. ప్రస్తుతం సినీ పరిశ్రమలో మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్.;
Samantha (tv5news.in)
Samantha: సమంత.. ప్రస్తుతం సినీ పరిశ్రమలో మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్. తాను ఇప్పుడు టాలీవుడ్‌లో నెంబర్ 1 పొజిషన్‌లో ఉంది అనుకోవడానికి కూడా ఆశ్చర్యం లేదు. సమంతతో పోల్చుకుంటే కొందరు ఇతర హీరోయిన్లు వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. కానీ సమంత మాత్రం తాను నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలనే పాన్ ఇండియా చిత్రాలుగా మలచుకుంటోంది. అంతే కాకుండా స్టార్ హీరోలకు సైతం ఫస్ట్ ఛాయిస్‌గా మారుతోంది సమంత.
టాలీవుడ్‌లో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోలతో జోడీకట్టింది సమంత. కానీ గత కొన్నిరోజులుగా తన యాక్టింగ్ ఏంటో ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ.. లేడీ ఓరియెంటెడ్ కథల వైపు అడుగులేస్తోంది. అందులోనూ విభిన్న కథలకే తాను ప్రాధాన్యం ఇస్తోంది. అయితే చాలారోజుల తర్వాత బ్యాక్ టు బ్యాక్ రెండు కమర్షియల్ సినిమాలను సమంత సైన్ చేసినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఎన్‌టీఆర్‌తో కలిసి నాలుగు సినిమాల్లో కలిసి నటించింది సమంత. ఇప్పుడు అయిదో సారి కూడా తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు టాక్. ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో సమంతనే హీరోయిన్‌గా నటించనుందని ఇప్పటకే రూమర్స్ వైరల్ అయ్యాయి. ఎన్‌టీఆర్ మాత్రమే కాకుండా మరో స్టార్ హీరోతో కూడా సామ్ నటించడానికి సిద్ధమవుతోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' తప్ప మరో సినిమా గురించి ఆలోచించట్లేదు. కానీ ఇప్పటికే టాలీవుడ్ టాప్ డైరెక్టర్లను తన తరువాతి సినిమాల కోసం లైన్‌లో పెట్టాడు. సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ సినిమాను ముందుగా ప్రారంభించాలి అనుకంటున్నాడు మహేశ్.
అయితే ఈ సినిమాలో ముందు హీరోయిన్‌గా పూజాను ఖరారు చేశారు. కానీ పలు కారణాల వల్ల తాను తప్పుకోవడంతో సమంత.. మరోసారి మహేశ్‌తో జతకట్టనుందని సమాచారం. వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పేరు తెచ్చుకున్న సామ్.. మరోసారి కమర్షియల్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.