Samantha Ruth Prabhu: సమంత ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసా..?
Samantha Ruth Prabhu: సమంత ఇన్‌స్టాగ్రామ్ చూస్తే.. ఈ మధ్య ఫోటోషూట్స్ కంటే బ్రాండ్ యాడ్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి.;
Samantha Ruth Prabhu: సమంత కెరీర్ అయిపోంది అనుకున్నారు.. ఆగిపోయింది అనుకున్నారు కొందరు.. కానీ పెళ్లి తర్వాత కానీ, విడాకుల తర్వాత కానీ సమంత మరింత స్ట్రాంగ్‌గా కమ్ బ్యాక్ ఇస్తూనే ఉంది. సినిమాలు చేసే విషయంలో స్పీడ్ పెంచింది. స్టోరీ సెలక్షన్ స్టైల్ మార్చింది. సినిమాల విషయంలోనే కాదు బ్రాండ్ యాడ్స్‌లో కూడా సమంత స్పీడ్ పెంచింది. ప్రస్తుతం తాను ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కోసం ఎంత ఛార్జ్ చేస్తుంది అన్న అంశం నెటిజన్లలో హాట్ టాపిక్‌గా మారింది.
సమంత రెండు రోజులకు ఒకసారి ఏదో ఒక బ్రాండ్ షూట్‌లో పాల్గొంటోంది. ఆ బ్రాండ్‌కు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది. సమంతకు ఇన్‌స్టాలో ఫాలోయింగ్ చాలా ఎక్కువ. తను ఏదైనా పోస్ట్ పెట్టిందంటే చాలు.. దానికి కాసేపట్లోనే వేలల్లో, లక్షల్లో లైక్స్ వచ్చేస్తుంటాయి. అందుకే తన ఇన్‌స్టా ఫాలోయింగ్‌ను తమ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారు కొందరు.
సమంత ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ చూస్తే.. ఈ మధ్య ఫోటోషూట్స్, మూవీ అప్డేట్స్ కంటే బ్రాండ్ యాడ్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఒక్క పోస్ట్ పెట్టడానికి సమంత రూ. 15 నుండి 20 లక్షలు ఛార్జ్ చేస్తుందట. పోస్ట్‌లాగా కాకుండా మామూలుగా ఒక బ్రాండ్‌కు అడ్వర్టైజింగ్ చేయాలంటే రూ. 1 నుండి 2 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టు టాక్. సమంత అటు సినిమాలతో, ఇటు బ్రాండ్ యాడ్స్‌తో చేతినిండా సంపాదిస్తోంది.