Samantha Ruth Prabhu: ఇల్లు వదిలేసి అక్కడే ఉండిపోవాలనుకుంటున్న సమంత..

Samantha Ruth Prabhu: తాజాగా సమంతకు తన ఇంట్లో ఉండడం కంటే మరో చోట ఉండడమే నచ్చుతుందని సమాచారం.

Update: 2022-03-17 06:36 GMT

Samantha Ruth Prabhu: ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో చాలా బిజీగా గడిపేస్తోంది. ఒకటి తర్వాత మరొకటి పాన్ ఇండియా సినిమాల్లో సైన్ చేస్తూ.. టాప్ హీరోయిన్‌గా మారిపోయింది. అందుకే సమంతకు ఇంతకు ముందుకంటే ఇప్పుడు ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అయితే తాజాగా సమంతకు తన ఇంట్లో ఉండడం కంటే మరో చోట ఉండడమే నచ్చుతుందని సమాచారం.

ఇటీవల సమంత తన అప్‌కమింగ్ సినిమా 'శాకుంతలం' షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. షూటింగ్ పూర్తవ్వడంతో శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగుపెట్టింది. దీంతో సామ్.. తాను సైన్ చేసిన 'యశోద' మూవీ సెట్స్‌లో అడుగుపెట్టింది. ఇటీవల ఈ మూవీ టీమ్‌తో సామ్ పార్టీ చేసుకున్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

యశోద సినిమా కోసం రూ. 5 కోట్లు ఖర్చుపెట్టి హోటల్ సెట్ వేయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ సెట్ కోసం ఆర్ట్ డైరెక్టర్ మూడు నెలలు పాటు కష్టపడ్డాడట. 200 మంది ఈ సెట్ నిర్మాణంలో పాల్గొ్న్నట్టు సమాచారం. అయితే సమంతకు ఈ హోటల్ సెట్ బాగా నచ్చేసిందట. అందుకే కొన్నాళ్లు ఇంటికి దూరంగా ఇక్కడే ఉండిపోతే బాగుండు అని తన యశోద సినిమా విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంది సామ్.

Tags:    

Similar News