Samantha Ruth Prabhu: నేను ఎక్కడికి వెళ్లినా దాని గురించే అడుగుతున్నారు: సమంత

Samantha Ruth Prabhu: సౌత్‌లోనే కాదు ప్రస్తుతం నార్త్‌లో కూడా సామ్ హవా కొనసాగుతోంది.

Update: 2022-03-11 10:15 GMT

Samantha Ruth Prabhu: ప్రస్తుతం సమంత ఒక ఫోటోషూట్ చేసినా.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా.. ఓ సినిమా అప్డేట్ అందించినా.. అది వైరల్ అవ్వడానికి ఎంతో సమయం పట్టట్లేదు. తాజాగా సమంత షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉంది. వరుస సినిమాలతో, ఫోటోషూట్స్‌తో, యాడ్స్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సమంత.. ఇటీవల ఓ అవార్డ్ ఫంక్షన్‌కు హాజరయ్యింది.

ఇటీవల సమంత కాస్త గ్లామర్ డోస్‌ను కూడా పెంచేస్తోంది. తాజాగా జరిగిన తన ఫోటోషూట్స్ చూస్తుంటే ఈ విషయం అర్థమయిపోతోంది. అంతే కాకుండా ఇటీవల సమంత ఓ యాడ్ షూట్ కోసం వేసుకున్న దుస్తులపై విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇదిలా ఉండగానే మరోసారి అవార్డ్ ఫంక్షన్ కోసం మరో గ్లామరస్ డ్రెస్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది.


సౌత్‌లోనే కాదు ప్రస్తుతం నార్త్‌లో కూడా సామ్ హవా కొనసాగుతోంది. అయితే అవార్డ్ ఫంక్షన్‌కు వెళ్లిన సమంత.. కాసేపు అక్కడ మీడియాతో ముచ్చటించింది. అందులో ఒకరు 'ఊ అంటావా' పాట గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అని అడగగా.. ఆ పాట అంత హిట్ అవుతుంది అనుకోలేదు అన్న విషయాన్ని బయటపెట్టింది సమంత.


'నేను ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ ప్రేక్షకులు మర్చిపోయారు. అందరికీ ఇప్పుడు కేవలం ఊ అంటావా పాటే బాగా గుర్తుంది. తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్‌లో ఈ పాట హిట్ అయ్యింది. ఊ అంటావా ఇంత హిట్ అయ్యినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది' అని తెలిపింది సమంత. ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా.. అందరూ తనను ఊ అంటావా పాట ఎక్స్‌పీరియన్స్ గురించే అడుగుతున్నారని తెలిపింది సామ్.

Tags:    

Similar News