Samantha Ruth Prabhu: ఒంటిపూట భోజనం, కేవలం రూ.500 కోసం ఆ పని చేశా: సమంత
Samantha Ruth Prabhu: అయితే సమంత పైచదువులు చేసే సమయానికి తన దగ్గర డబ్బులు లేవట.;
Samantha Ruth Prabhu: స్టార్ హీరో లేదా స్టార్ హీరోయిన్ స్థాయికి రావాలంటే ముందుగా ఎన్నో అడ్డంకులను దాటి రావాలి. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఎప్పటికప్పుడు ఎంతో పోటీని తట్టుకోవాలి. క్యాస్టింగ్ కౌచ్‌లాంటి కష్టాలను దాటుకుంటూ రావాలి. అప్పుడే నెంబర్ 1 కిరీటం సొంతం అవుతుంది. అలా సమంత కూడా తన కెరీర్ మొదట్లో ఎదుర్కున్న కష్టాల గురించి ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
సమంత రుత్ ప్రభు.. ప్రస్తుతం సౌత్‌లోనే కాదు నార్త్‌లో కూడా తాను ఓ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తాను ఎన్ని కోట్లు డిమాండ్ చేసినా దర్శక నిర్మాతలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఒప్పుకునే రేంజ్‌కు ఎదిగింది సమంత. కానీ ఈ పొజిషన్‌కు రావడం కోసం తాను ఎంతో కష్టపడింది. ఇటీవల తాను సినిమాల్లోకి రాక ముందు విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది సామ్.
సమంత చదువుల్లో టాపర్ అని ఇప్పటికే చాలామందికి తెలుసు. తన చిన్ననాటి విషయాలను ఎన్నోసార్లు అందరితో షేర్ చేసుకుంది సామ్. అయితే తాను పైచదువులు చేసే సమయానికి తన దగ్గర డబ్బులు లేవట. అందుకే డబ్బుల కోసం పెద్ద పెద్ద ఫంక్షన్ల దగ్గర వెల్‌కమ్ చెప్పే అమ్మాయిగా పనిచేసిందట. ఆ సమయంలో తనకు రూ.500 ఇచ్చేవారని చెప్పింది సామ్.
అలా తన చేతిలో అస్సలు డబ్బు లేని సమయంలో ఒంటిపూట కూడా భోజనం చేశానని సమంత బయటపెట్టింది. అలా ఒంటిపూట భోజనంతోనే తాను రెండు నెలలు గడిపేసిందట. అలా ఖర్చుల కోసం మోడలింగ్ స్టార్ట్ చేశానని తెలిపింది సామ్. ఆ సమయంలో తనను కేవలం తన తల్లిదండ్రులు మాత్రమే ప్రోత్సహించారని అన్నారు సమంత.