Yashoda Glimpse: 'యశోద' గ్లింప్స్ రిలీజ్.. అసలు సమంతకు ఏమైంది..? ఎక్కడుంది..?

Yashoda Glimpse: తన కెరీర్‌లో సామ్ చేస్తున్న మొదటి ప్రయోగాత్మక చిత్రం యశోదనే అని గ్లింప్స్ చూస్తే అనిపిస్తోంది.;

Update: 2022-05-05 09:00 GMT

Yashoda Glimpse: ప్రస్తుతం సౌత్‌లోనే కాదు.. నార్త్‌లో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సమంత. సామ్ ఏదైనా సినిమా చేస్తుందంటే చాలు.. దానికి ప్రేక్షకుల్లో అంచనాలు ఆటోమేటిక్‌గా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం సామ్ చేస్తున్న తరువాతి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి చాలానే ఉంది. తాజాగా తన అప్‌కమింగ్ మూవీస్‌లో ఒకటైన 'యశోద' గ్లింప్స్ విడుదలయ్యింది.

ఇప్పటికే 'కాతువాకుల రెండు కాదల్' చిత్రంలో కోలీవుడ్‌లో క్లీన్ హిట్‌ను అందుకుంది సమంత. ఈ సినిమాలో తెలుగులో అంతగా హైప్ క్రియేట్ చేయలేకపోయినా.. తమిళంలో మాత్రం ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంటోంది. దీని తర్వాత సమంత నటిస్తు్న్న చిత్రమే 'యశోద'. ఈ సినిమాకు హరి, హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. యశోద మూవీ గ్లింప్స్ చాలా ఆసక్తికరంగా ఉంది.

సమంత ఇప్పటివరకు ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాల్లో నటించలేదు. కానీ తన కెరీర్‌లో సామ్ చేస్తున్న మొదటి ప్రయోగాత్మక చిత్రం యశోదనే అని గ్లింప్స్ చూస్తే అనిపిస్తోంది. ఈ గ్లింప్స్‌లో అసలు సమంత ఎక్కడుంది, ఏం చేస్తుంది.. ఇంతకీ తనకు ఏం జరిగింది అనే అంశాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. ఇక వీటన్నింటికి సమాధానం తెలియాలంటే ఆగస్ట్ 12 వరకు ఆగాల్సిందే.

Tags:    

Similar News