ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సాయిపల్లవి, నజ్రియా, అలియా భట్ వంటి హీరోయిన్లు రాక్ స్టార్లు అని హీరోయిన్ సమంత చెప్పారు. ఇన్‌స్టాలో అభిమానుల ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. నెగటివ్ ఆలోచనలను అధిగమించేందుకు రెగ్యులర్‌గా మెడిటేషన్ చేస్తానని తెలిపారు. తెలుగులో సినిమాలు చేయాలని ఓ టాలీవుడ్ ఫ్యాన్స్ కోరగా తప్పకుండా మళ్లీ వస్తానని బదులిచ్చారు. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ చూసినట్లు పేర్కొన్నారు.
ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఇటీవల మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ లిస్ట్ విడుదల చేసింది. 2024లో ఆ పోర్టల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన హీరో- హీరోయిన్ల లిస్ట్ ప్రకటించింది. ఆ లిస్టులో సమంత ఎనిమిదో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. టాప్‌లో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ నిలిచారు.
ప్రస్తుతం సమంత ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’లో నటిస్తున్నారు. ‘తుంబాడ్’ ఫేమ్ రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌లో ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని గత సంవత్సరం ప్రకటించారు. ఇప్పటిదాకా దానిపై మరో అప్‌డేట్ రాలేదు.