రెబల్ స్టార్ ప్రభాస్ కోసం యానిమిల్ బ్యూటీని ఫైనల్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. స్పిరిట్ మూవీ షూటింగ్ ను ఈ యేడాది ఆరంభంలోనే ప్రారంభిస్తారు అని చెప్పినా.. బాగా ఆలస్యం అయింది. రాబోయే రెండు మూడు నెలల్లో స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి. అందుకే ప్రీ ప్రొడక్షన్ లో వేగం పెంచాడు సందీప్. ఈ క్రమంలో ముందుగా ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ల లిస్ట్ చాలానే కనిపించింది. ఫైనల్ గా దీపికా పదుకోణ్ ను తీసుకున్నారు. అయితే తను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అందుకు కారణంగా తను చెప్పిన మాట ఇదీ అంటూ.. ‘దర్శకుడు కోరిన కొన్ని అన్ ప్రొఫెషనల్ డిమాండ్స్’వల్లే దీపికా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అనే న్యూస్ వచ్చాయి. అందులో నిజాలేంటో దర్శకుడు, దీపికాకే తెలియాలి.
ఇక ఓపెనింగ్ టైమ్ దగ్గరకు వస్తోందనుకున్నాడేమో.. సందీప్ ఇవన్నీ ఎందుకు అని తనే బ్రేక్ ఇచ్చిన యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రిని తీసుకున్నట్టు ప్రకటించాడు. యానిమల్ మూవీలో తృప్తి అందాలకు అంతా ఫిదా అయ్యారు. బోల్డ్ సీన్స్ లోనూ నటించింది. అప్పటి వరకూ ఎన్ని చేసినా తను యానిమల్ తో ఓవర్ నైట్ కంట్రీ మొత్తం తెలిసిపోయింది. కానీ ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోలేకపోయిందీ బ్యూటీ. తర్వాత వచ్చిన మూవీస్ అన్నీ పోయాయి. ఈ టైమ్ లో మరోసారి సందీప్ పిలిస్తే నో చెబుతుందా.. అందుకే వెంటనే ఎస్ చెప్పింది. ఇక ఈ విషయాన్ని సందీప్ ఏకంగా 9 భాషల్లో హీరోయిన్ పేరు రాయించి చివర్లో స్పిరిట్ అని చెప్పి.. అనౌన్స్ చేశాడు. మరి తృప్తి దిమ్రితో మన రెబల్ స్టార్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి.