Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట మూడు రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Sarkaru Vaari Paata : రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో షేర్ రూ. 48 కోట్లు వసూళ్ళు సాధించిన ఈ చిత్రం మూడు రోజులకు కలిపి రూ.59.06 కోట్లు వసూళ్ళు చేశాయి.;
Sarkaru Vaari Paata : మహేష్ సర్కారు వారి పాట కలెక్షన్ల జోరు ఆగడం లేదు.. రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో షేర్ రూ. 48 కోట్లు వసూళ్ళు సాధించిన ఈ చిత్రం మూడు రోజులకు కలిపి రూ.59.06 కోట్లు వసూళ్ళు చేశాయి. అటు మూడు రోజులకు కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ.112 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల కలెక్షన్స్ వివరాలు:
♦ నైజాం - రూ. 22.48 కోట్లు
♦ సీడెడ్ - రూ.7.38కోట్లు
♦ ఉత్తరాంధ్ర - రూ.7.34కోట్లు
♦ ఈస్ట్ - రూ. 5.39 కోట్లు
♦ వెస్ట్ - రూ. 3.64 కోట్లు
♦ గుంటూరు - రూ. 6.80 కోట్లు
♦ కృష్ణా - రూ. 3.75 కోట్లు
♦ నెల్లూరు - రూ.2.30 కోట్లు
♦ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం: రూ. 12.01 కోట్లు (రూ. 18.10 కోట్ల గ్రాస్)
♦ ఇక కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియా కలిపి చూస్తే రూ.3.95 కోట్లు షేర్ రాగా, ఓవర్ సీస్‌లో రూ.9.21 కోట్లు వచ్చాయి.
గీతాగోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ కలిసి సంయుక్తంగా నిర్మించగా తమన్ సంగీతం అందించాడు.
త్రివిక్రమ్, రాజమౌళిలతో సినిమాలు :
ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోన్న మహేష్. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయనున్నారు.. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. చాలా తక్కువ రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసి రాజమౌళి సినిమాకి షిఫ్ట్ కావాలని భావిస్తున్నాడు.