Sathyaraj : సెన్సార్ పూర్తి చేసుకున్న ‘త్రిబాణధారి బార్బరిక్’

Update: 2025-08-28 11:00 GMT

సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన ఈ ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఆగస్ట్ 29న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అందరిలోనూ అంచనాలు పెంచేశాయి.

ఇప్పటికే ‘త్రిబాణధారి బార్బరిక్’ ప్రివ్యూల్ని వరంగల్, విజయవాడ వంటి చోట ప్రదర్శించగా మంచి స్పందన వచ్చింది. ఈ స్పెషల్ షో తరువాత చిత్రంపై మరింత హైప్ ఏర్పడింది. ఈ మూవీ రిలీజ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు తాజాగా జరిగాయి.

‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. కంటెంట్‌తో పాటుగా, మంచి సందేశాన్ని ఇచ్చేలా ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీని తెరకెక్కించారని టీంపై ప్రశంసలు కురిపించారు. డిఫరెంట్ ప్రమోషన్స్‌ చేస్తూ ఇప్పటికే ఆడియెన్స్‌లో బజ్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్రానికి కుశేందర్ రమేష్ రెడ్డి అందించిన విజువల్స్, ఇన్ ఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఆగస్ట్ 29న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నారు.

Tags:    

Similar News